Brahmamudi : బాబు తల్లి పేరు వెన్నెల.. ఎంక్వయిరీ చేస్తున్న కావ్య?
on Apr 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -374 లో... ఎండీ బాధ్యతలు కళ్యాణ్ కి అప్పజెప్పాలని అనామిక, ధాన్యలక్ష్మి కలిసి సీతారామయ్యని అడుగుతారు. కళ్యాణ్ కి ఆఫీస్ గురించి తెలియదు.. రాహుల్ కు ఎక్స్పీరియన్స్ ఉందని ఎండీ బాధ్యతలు రాహుల్ కే అప్పజెప్పమని స్వప్న చెప్తుంది.
ఆ తర్వాత రాహుల్ ఏమైన ఈ ఇంటికి వారసుడా అని అనామిక అడుగుతుంది. కొడుకు కొడుకుకే కాదు కూతురు కొడుకుకి కూడా హక్కు ఉంటుందని రుద్రాణి అంటుంది. కళ్యాణ్ ని ఎండీ చెయ్యండని అనామిక అనగానే.. నాకు ఇంట్రస్ట్ లేదని కళ్యాణ్ అంటాడు. దాంతో ఇక ఎండీ పదవి నీకే అంటూ రాహుల్ , రుద్రాణి ఇద్దరు సంబరపడిపోతారు. అప్పుడే సుభాష్ వచ్చి.. ఎవరు ఈ పదవికి అర్హులు అనేది నేను చెప్తాను, ఆఫీస్ ని సమర్ధవంతంగా నడపగిలిగే ట్యాలెంట్ ఒక్కరికి మాత్రమే ఉంది అది నా కోడలు కావ్య.. నా కొడుకు భార్య అని చెప్పట్లేదు. తన ట్యాలెంట్ ని, క్లయింట్ ని డీల్ చేసే విధానాన్ని నేను దగ్గర నుండి చూసానని సుభాష్ అంటాడు. నాకు ఈ నిర్ణయం సరైనదే అనిపిస్తుందని కళ్యాణ్ అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. అలాగే నాకు ఈ నిర్ణయం నచ్చిందని స్వప్న అనగానే.. నాకు నచ్చలేదు, నా భర్త తప్పు చేసాడని పదవి నుండి తప్పుకున్నాడు.. నాకు అతను ఏ తప్పు చెయ్యలేదని నమ్మకం ఉంది. నేను ఎండీగా ఉండలేను.. ఈ ఇంటి వారసుడిగా కళ్యాణ్ కి ఆ అర్హత ఉందని కావ్య చెప్తుంది.
ఆ తర్వాత కంపెనీ ప్రాబ్లమ్ లో ఉంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట ర్ గా ఉంటాను కానీ ఎండీగా ఉండనని కళ్యాణ్ చెప్తాడు. ఆ తర్వాత కావ్య, రాజ్ గదిలోకి వెళ్తారు. మీరు ఏమైనా త్యాగమూర్తి అనుకుంటున్నారా? ఎందుకు ఎండీ పదవిని వదిలేసారని కావ్య అడుగుతుంది. అసలు ఈ బిడ్డ తల్లి పేరు చెప్పండని కావ్య అడుగుతుంది. పేరు చెప్తే సరిపోతుందా అంటు.. బాబు తల్లి పేరు వెన్నెల అని రాజ్ చెప్తాడు. నువ్వు ఆఫీస్ చూసుకుంటూనే ఈ కవితలు కూడా రాసుకోవచ్చు అందుకోసం నేను హెల్ప్ చేస్తానని కళ్యాణ్ కి కావ్య చెప్తుంది. తరువాయి భాగంలో వెన్నెల గురించి ఎంక్వయిరీ చేసి తన ఇంటికి వెళ్తుంది కావ్య. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read